గుడుపల్లి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఏ. కళ నామినేషన్
పార్టీ శ్రేణుల సమక్షంలో నామినేషన్ దాఖలు.. విజయమే లక్ష్యంగా ముందడు
గుడుపల్లి మేజర్ న్యూస్ : గుడుపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో గుడుపల్లి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఏ. కళ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గుడుపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ముఖ్య నాయకులు భవాని చంద్రశేఖర్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
గుడుపల్లి ఎంపీటీసీ స్థానంలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కీలకమని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని నాయకులు సూచించారు.
నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి తమ సంఘీభావం తెలిపారు.
రిపోర్టర్: రాజు గుడిపల్లి మండలం