ఘనంగా ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం స్వర్ణాంధ్ర ఎన్జీవో మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక కంబాల చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో తొలుత తూర్పుగోదావరి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కనకరాజు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిరాశ్రయులందరూ తిరిగి వారి కుటుంబాలకు చేరే విధంగా వారి ఆలోచన మారాలని పిలుపునిచ్చారు. పది సంవత్సరాలుగా నిరాశ్రయుల కేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా సౌజన్యంతో నిర్వహిస్తున్నామని స్వర్ణాంధ్ర ఎన్జీవో నిర్వాహకులు రాంబాబు తెలిపారు అనేక వేల మందికి నిరాశ్రయుల కేంద్రం వసతి కల్పించడంతోపాటు వందల మందిని తిరిగి వారి కుటుంబాలకు చేర్చామన్నారు వివిధ కారణాల రీత్యా మధ్య వయసులో ఉన్నవారు రోడ్డున పడుతున్నారని వారికి ఉద్యోగ ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి రాంబాబు విజ్ఞప్తి చేశారు .ఈ సందర్భంగా నిరాశ్రయులు తో కలిపి కంబాలచెరువు నుండి చిరంజీవి బస్ షెల్టర్ హైటెక్ బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు మరిన్ని నిరాశ్రయుల కేంద్రాల ఏర్పాటు చేయాలని నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాథమిక వైద్యుల సంఘం అధ్యక్షులు వల్ల శ్రీనివాస్ స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు నిరాశ్రయుల కేంద్రం మేనేజర్ హరికృష్ణ శ్రీనివాస్ రాజేష్ రాంజీ నిరాశ్రయులు పాల్గొన్నారు