ఘనంగా ప్రారంభమైన దంత కొత్తమ్మతల్లి 14వ వార్షికోత్సవం
కోటబొమ్మాళి, అక్టోబరు 12, మేజర్ న్యూస్: మండలం దంత గ్రామంలో కొలువైన కొత్తమ్మతల్లి 14వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు మం గళవారం ప్రారంభమై గురువారం రాత్రితో ముగిస్తాయని ఆలయ ధర్మకర్త తెలిపారు. మంగళవారం ఉదయం అమ్మవారి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళ భక్తులు కుంకుమ పూజలు, అమ్మవారి తిరువీధి, విఘ్నేశ్వరపూజలను అలయపురోహితులు ఉమాబాబు ఘనంగా నిర్వహించారు. గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని ఆలయ కమిటి -సభ్యులు తెలిపారు.