BREAKING
గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో రజతం సాధించి చరిత్ర తిరగరాసిన భారత వీరుడు నిల్వ నీటిని తొలగిద్దాం. దోమల వ్యాప్తిని అరికడదాం ఎస్వీయూ ఫైనాన్స్ ఆఫీసర్ గా చంద్రయ్య ప్రజల విశ్వాసమే మా బలం అభివృద్దే చంద్రబాబు లక్ష్యం అక్టోబర్ 5న ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ భూమి పూజ: ఏర్పాట్లను పరిశీలించిన హరీష్ బాబు * కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, లోకేష్, సత్యకుమార్ రాక – మార్కెట్ యార్డ్, హెలిప్యాడ్‌లలో ము పిల్లల ఆరోగ్యమే అంగన్వాడీల లక్ష్యం 2న జర్నలిస్ట్ ల కోర్కెల దినోత్సవాన్ని (ప్రోగ్రామ్ డిమాండ్స్ పత్రం) జయప్రదం చేయండి -ఎపియుడబ్లుజె నంద్యాల జిల్లా నాయకులు కుట్ర కోణాన్ని ఛేదిస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సీఎం చంద్రబాబు పర్యటనపై 2న కూటమి నేతల సమావేశం పథకం ప్రకారమే యువకుని హత్య - నలుగురి అరెస్టు లింగాల అసంఘటిత కార్మికులకు స్మార్ట్ శ్రామిక్ మిషన్ అండ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఢిల్లీలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా మహా ఉద్యమం ఏపీఎస్పీడీసీఎల్ లో 14 మందికి ఉద్యోగోన్నతులు పౌరులందరూ హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి - తహసీల్దార్..

గణిత బోధనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి.. డి ఈ ఓ అయూబ్

Select Suryaa Now
గణిత బోధనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి.. డి ఈ ఓ అయూబ్

(Mallikarjuna Surya Staff Reporter)

 

కళ్యాణదుర్గంలోని   కే సి జి హెచ్ ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులకు గణిత బోధనలో ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలో జిల్లా విద్యాశాఖాధికారి అయూబ్  ప్రత్యక్షంగా సూచనలు అందించారు. గణితంలోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా డిజిటల్‌ పద్ధతులు, దృశ్యరూపకాలు, సాంకేతిక సాధనాలను ఉపయోగించాలని సూచించారు.
తరగతి గదిలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంచడంతో పాటు, విషయాన్ని అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని డిఇఓ  వివరించారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, అవసరమైన చోట సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి బోధించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా వివిధ బోధనా విధానాలను వివరిస్తూ, గణిత సూత్రాలు, సమస్యల పరిష్కార పద్ధతులను సాంకేతికత సహాయంతో విద్యార్థులకు ఆసక్తికరంగా వివరించే విధానాన్ని చూపించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకుంటూ, ప్రతి విద్యార్థికి గణితం సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందేలా గణిత బోధన సాగాలని డీఈఓ  పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని, దాన్ని తరగతి గదిలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.