ఎస్వీయూ ఫైనాన్స్ ఆఫీసర్ గా చంద్రయ్య
ఎస్వీయూలో జాయింట్ రిజిస్ట్రార్గ గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్య ఇంచార్జి ఫైనాన్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. గతంలో పనిచేసిన నాగేష్ పదవీకాలం పూర్తి కావడంతో ఆయనకు ఇంచార్జి ఆఫీసర్ బాధ్యతలను అప్పగిస్తూ వర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం బాధ్యతలు చేపట్టిన ఆయనను వర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ గురంకొండ, ప్రధాన కార్యదర్శి నెల్లూరు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు కోటగరం మురళి, సంయుక్త కార్యదర్శి ముత్తు వేలు, కోశాధికారి గురు ప్రసాద్, ఈసీ సభ్యులు, ఎన్ఎన్ఆర్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రమేష్, మీడియా కోఆర్డినేటర్ మనోజ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొని పుష్పగుచ్ఛం అందించి సత్కరించి అభినందనలు తెలియజేశారు