పిల్లల ఆరోగ్యమే అంగన్వాడీల లక్ష్యం
పిల్లల ఆరోగ్యమే అంగన్వాడీల లక్ష్యం
పులివెందుల మేజర్ న్యూస్:
దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రం ప్రఖ్యాత పోషణ విధానం అవగాహన కార్యక్రమంలో భాగంగా "అంగన్వాడీ ఉత్సవాలు" కార్యక్రమం పులివెందుల పట్టణంలోని మారుతి హల్ రోడ్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ అధికారిని మబూన్ని, సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, పరిశీలకులుగా బిజెపి సీనియర్ నాయకులు తిరుపాల్రెడ్డి మండల అధ్యక్షుడు నవీన్ పాల్గొని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలు, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణపై పలు వివరాలను వెల్లడించారు ప్రతి నెలా గర్భిణీలు మరియు బాలింతలకు 3 కేజీల బియ్యం, 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1 కేజీ కందిపప్పు, అర కేజీ నూనె, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, 250 గ్రాముల ఖర్జూరాలు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీలను మొదటి మరియు మూడవ శు క్రవారాల్లో ఇంటికే అందజేస్తున్నట్లు తెలిపారు. 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతం,25 గుడ్లు, 2.5 లీటర్ల పాలు రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ-స్కూల్ కిట్ల ద్వారా ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ, ప్రతిరోజూ వేడివేడి భోజనంతో పాటు ఒక రోజూ గుడ్డు, 100మి.లీ. పాలు అందిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువులను పరిశీలిస్తూ, పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలను 'నవచేతన' యాప్లో నమోదు చేసి అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నట్లు విలేజ్ హెల్త్ శానిటైజేషన్ న్యూట్రిషన్ డే ద్వారా టీకాలు వేయడం, పీఎంఎంవీవై పథకం కింద మొదటి కాన్పు గర్భిణీలకు రూ.5,000/-, రెండో కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే రూ. 6,000/- ఆర్ధిక సాయం అందుతుందని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.కేంద్రానికి ప్రభుత్వం అందించిన పొల్యూషన్ ఫ్రీ ఇండక్షన్ స్టవ్, స్టీల్ గిన్నెలు, పిల్లల ప్లేట్లు మరియు గ్లాసులను పరిశీలించారు. కేంద్రం పరిధిలోని తల్లులందరూ అంగన్వాడీ సేవలను మరియు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నాగ మున్నమ్మ సలీమా పద్మావతి సుధా, హెల్పర్స్ తులసి,అమ్మని,పద్మ, ఆయా, వార్డు సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా పోలీస్ మరియు చిన్నారుల తల్లులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.