BREAKING
మినీ గోకులం షెడ్డు శంకుస్థాపన లో ఎమ్మెల్యే బొలిశెట్టి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ తెస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం పారిశుధ్య కార్మికులతో కలిసి.. నాలా శుభ్రతలో చైర్‌పర్సన్‌ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్లు ఎంపికలు గాంధీనగర్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం తరిగొండ వెంగమాంబ గోశాలకు విరాళాలు అందించి గోవులను ఆదుకోండి ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’ వయోవృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య హైకోర్టుకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన

ప్రజల విశ్వాసమే మా బలం అభివృద్దే చంద్రబాబు లక్ష్యం

Select Suryaa Now
ప్రజల విశ్వాసమే మా బలం  అభివృద్దే చంద్రబాబు లక్ష్యం

ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. 

విధ్వంసం వైసీపీ క్రెడిట్ అయితే అభివృద్ధి కూటమి క్రెడిట్.

అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ అసత్య ప్రచారాలు.

 

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యం. డాక్టర్ 

గొట్టిపాటి లక్ష్మీ.

 

దర్శి మేజర్ న్యూస్. 

ప్రజల విశ్వాసమే మా బలమని అభివృద్ధి చంద్రబాబు లక్ష్యమని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.

దర్శి లోని టిడిపి కార్యాలయం నందు పి ఎం ఏ వై అర్బన్ 2.0 పథకం ద్వారా156 మంది కుటుంబాలకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలును డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యం గా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గం లో మొదటి ఫేజ్ లో : 272,  రెండవ ఫేజ్ లో గురువారం: 156 మొత్తం: 428 గృహాలు మంజు చేశామనిడాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో హోసింగ్ 

డి. ఈ దారివేముల నిరీక్షణ రావు, దర్శి ఎ.ఈ షాకీర్ బాషా, కురిచేడు ఎ.ఈ డి. కొండయ్య, ముండ్లమూరు ఏ. ఈ టి. వెంకటేశ్వర రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ తాండవ. కొండ, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి, కురిచేడు మండల, దర్శి టౌన్  టిడిపి అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, పిడతల నేమిలయ్య, పుల్లలచెరువు సత్యనారాయణ, బిజెపి నాయకులు తిండి నారాయణ రెడ్డి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.