BREAKING
మినీ గోకులం షెడ్డు శంకుస్థాపన లో ఎమ్మెల్యే బొలిశెట్టి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ తెస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం పారిశుధ్య కార్మికులతో కలిసి.. నాలా శుభ్రతలో చైర్‌పర్సన్‌ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్లు ఎంపికలు గాంధీనగర్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం తరిగొండ వెంగమాంబ గోశాలకు విరాళాలు అందించి గోవులను ఆదుకోండి ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’ వయోవృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య హైకోర్టుకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన

సీఎం చంద్రబాబు పర్యటనపై 2న కూటమి నేతల సమావేశం

Select Suryaa Now
సీఎం చంద్రబాబు పర్యటనపై 2న కూటమి నేతల సమావేశం

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్ :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్‌ 5న ప్రొద్దుటూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 2న సాయంత్రం 4 గంటలకు యర్రగుంట్ల బైపాస్‌ రోడ్డులోని భారత్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జీలు, కేఎస్‌ఎస్‌ సభ్యులు హాజరు కావాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.