BREAKING
ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’ వయోవృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య హైకోర్టుకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఏపీఎస్పీడీసీఎల్ లో 14 మందికి ఉద్యోగోన్నతులు

Select Suryaa Now
ఏపీఎస్పీడీసీఎల్ లో 14 మందికి ఉద్యోగోన్నతులు

ఏపీఎస్పీడీసీఎల్ లో 14 మందికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ అకౌంట్స్ విభాగంలో  సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న జె.చిన్న రాఘవులుకు జనరల్ మేనేజర్ గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ, సంస్థ కార్పొరేట్ ఆఫీసులో రెవెన్యూ, ఇంటర్నల్ ఆడిట్ విభాగపు జనరల్ మేనేజర్ గా నియమించారు. అలాగే అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ వి బ్రహ్మాచారికి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అకౌంట్స్ విభాగంలోనే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్ గా ఒకరికి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లుగా ముగ్గురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్న జి. ఎల్లప్పకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ఉద్యోగన్నతి కల్పించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తున్న నలుగురికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగానూ, జూనియర్ ఇంజనీర్లుగా విధులను నిర్వహిస్తున్న ముగ్గురికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగాను ఉద్యోగోన్నతి కల్పిస్తూ సిఎండి శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి