BREAKING
అనంతలో అక్టోబర్ 4న ఆర్‌డీటీ బాలుర క్రికెట్ సెలక్షన్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీకి విజ్ఞప్తి పీఎం–సూర్యఘర్ పై ప్రత్యేక అవగాహన - 17 నుంచి అక్టోబరు 17 వరకు ‘సేవా సేతు' క్యాంప్ -రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుతో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గింపు -ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి రోడ్డు భద్రతపై వాహనదారులకు ఎల్ కోట పోలీసుల అవగాహన గాంధీ జయంతిని పురస్కరించుకొని .. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు, రాజమహేంద్రవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘన నివాళులు ఆమె ఒక రాణి, గొప్ప యువరాజును పెంచారు.. అత్త లక్ష్మి శివకుమార్ గురించి జ్యోతిక భావోద్వేగ వ్యాఖ్యలు! ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం : ఎస్ఎఫ్ఐ బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం - టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గాంధీజీ జయంతి వేడుకలలో వి బాలాజీ రెడ్డి టాలీవుడ్‌లో సింగర్ మంగ్లీకి ప్రత్యామ్నాయంగా మారుతున్న జానపద గాయని ప్రభ.. వరుస హిట్లతో జోరు! వార్షికోత్సవ ఏర్పాట్లపై సర్వసభ్య సమావేశం గాంధీజీ చూపిన బాటలో నడవాలి... బూరుగుపల్లి శేషారావు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ ప్రభుత్వం సాగు రైతులకు పట్టాలి ఇవ్వాలి

గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

బుచ్చిరెడ్డిపాలెం,మేజర్ న్యూస్  :  గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని జీవితం కొనసాగించాలని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి పేర్కొన్నారు. గాంధీజీ 157 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ కమీషనర్ ఇనమల చిన్నబాబు తో కలసి ముంబై రోడ్ లోని మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని మనుగడ సాగించాలన్నారు. సమాజాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా  తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొని వడ్డించారు. పార్టీలకతీతంగా జరిగిన ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు శాలువా, పుష్పగుచ్చంతో  సత్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎరటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు పుట్టా లక్ష్మీకాంతమ్మ, చలం  చర్ల శ్రీదేవి, బెళ్ళుం మల్లారెడ్డి, సత్యం, ఉపాధ్యాయులు, సామాజికవేత్త గండికోట సుధీర్ కుమార్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.