గాంధీజీ ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకం.
మెలియాపుట్టి. అక్టోబర్ 2. మేజర్ న్యూస్...
మెళియాపుట్టి మండల కేంద్రంలోని మోడల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జి.గోవిందరావు, శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనపాన రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పద్మ, హేమంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.