గజవాహనంపై గోవిందుడి దివ్య కటాక్షం.
తిరుమల మేజర్ న్యూస్,
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.ముందుగా గజరాజులు నడుస్తుండగా, మంగళవాయిద్యాలు, భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణాల నడుమ గజవాహనసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
గజవాహన సేవతో కర్మ విముక్తి
రాజ వైభవానికి, గౌరవ మర్యాదలకు ప్రతీకగా నిలిచే గజవాహనంపై స్వామివారి దర్శనం సకల పాపాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. గజవాహనసేవలో టీటీడీ గజరాజులు సైతం పాల్గొని ఉత్సవ వైభవాన్ని మరింత శోభాయమానం చేస్తున్నాయి.ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వెంకటరాజు, తిరుమల