గాళ్ళ సుబ్రమణ్యం పెద్దకర్మ, సంతాప సభ
విజయవాడలో కాపునాడు జాతీయ అధ్యక్షులు కీ॥శే॥ గాళ్ళ సుబ్రమణ్యం పెద్దకర్మ, సంతాప సభ కార్యక్రమానికి శ్రీమతి వంగవీటి ఆశ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సుబ్రమణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు, రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.