ఎస్వీయూలో ముగిసిన జాతీయ సదస్సు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ రాజనీతి, ప్రభుత్వ పరిపాలన శాస్త్ర విభాగం, పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెక్టార్ చెండ్రాయుడు హాజరై మాట్లాడుతూ కృత్రిమ మేధస్సును కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణ స్పృహలో కాకుండా జవాబుదారీతనం, ప్రజా భాగస్వామ్యం, పారదర్శకత, సమ్మిళిత ప్రజాస్వామ్య పాలనలను బలోపేతం చేసే ఒక వ్యూహాత్మక సాధనంగా పరిగణించాలని సూచించారు. కృత్రిమ మేధస్సు అంతిమ విజయాన్ని కేవలం గణనాత్మక సామర్థ్యం, పనితీరు ఆధారంగానే కాకుండా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు, ప్రజల గౌరవాన్ని నిలబెట్టడానికి అది అందించే తోడ్పాటు ఆధారంగా కూడా అంచనా వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్రాసు విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఆర్ మతయాన్, హైదరాబాదు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కే సాంబమూర్తి, విభాగ అధిపతి ఆచార్య బీవీ మురళీధర్, ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, మహిళా వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ మమత, ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమీషనర్ డాక్టర్ బాలకృష్ణన్ సద్సు కో డైరెక్టర్లు డాక్టర్ ఐఎస్ కిషోర్, డాక్టర్ సిఎల్ చెన్నా రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్