ఎన్నికల విజయం అనంతరం - అమ్మవారి సన్నిధిలో నేతల సందడి
దుర్గి మేజర్ న్యూస్ :
దుర్గి మండల పరిధిలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.శుక్రవారం ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా కృషి చేస్తామని వారుతెలిపారు.
పేర్ల వెంకటేశ్వర్లు దుర్గి సూర్య రిపోర్టర్