ఎమ్మిగనూరు పట్టణాభివృద్ధికి కట్టుబడి వున్నాం
ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి రూ. 31 కోట్లు.. ఎం ఎల్ ఏ బీవీ
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలో 31 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹ 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించగా అందులో భాగంగా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కి ₹ 31కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీవీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్ల అభివృద్ధి, మురుగు నీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, తాగునీటి పైపులైన్ల మెరుగుదల మౌలిక వసతుల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు మైరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తూ, ఎమ్మిగనూరు పట్టణాన్ని ఆధునిక వసతులతో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.