BREAKING
'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు

ఎమ్మెల్యేను కలిసిన టిటిడి వేద పండితులు

Select Suryaa Now
ఎమ్మెల్యేను  కలిసిన టిటిడి వేద పండితులు

ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ను కలిసిన టిటిడి వేద పండితులు*

మురమళ్ళ: మేజర్ న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల వేద పండితులుగా నియామకం పొందిన వేద పండితులు సోమవారం ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ను మురమళ్ళ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిశారు. 

దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న  6 సి ఆలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా భారీగా వేద పండితుల నియామకం జరిగింది. ఈ సందర్భంగా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన నాగాభట్ల పి ఎస్ టీ ఆర్ కృష్ణవధానులు ఇంజరం శ్రీ ఉమా కృపేశ్వర స్వామి దేవస్థానం వేదపండితులుగా,  కోలంక గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వేద పండితులు గా నాగాభట్ల వేంకట నారాయణ దత్త గణేష్ శర్మను నియమించింది. ఈ సందర్భంగా శాసన సభ్యులను కృతజ్ఞత పూర్వకం కలిశారు. దుశ్శలవతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి ఆది శంకరాచార్య ప్రతిమను అందజేశారు. అనంతరం నియామక పత్రాలు ఎమ్మెల్యే చేతులు మీదుగా అందుకొన్నారు. కార్యక్రమం లో శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ బ్రహ్మ నాగాభట్ల రమేష్, స్వస్తి వాచకులు నాగాభట్ల రవి శర్మ, వీర వెంకట సుబ్రహ్మణ్యం, వేంకట రమణ మూర్తి తదితరులు ఉన్నారు.