BREAKING
స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారతదేశాన్ని నిర్మించడంలో యువతదే ప్రధాన బాధ్యత: బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కందికట్లరాజేశ్వరి స్టేట్ కోపరేటివ్ బ్యాంకు చే రాష్ట్రస్థాయిలో వేగవరం సొసైటీకి బెస్ట్ ఫెయిర్ ఫార్మాన్స్ స్టేట్ అవార్డు రూ 10.75 కోట్లతో మండపేటలో అభివృద్ధి పనులు ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ: పడిపోయిన రిలయన్స్ సంపదతో భారత కుబేరుల జాబితాలో పెను మార్పులు రేపు ఉదయం యాదాద్రి పవర్ ప్లాంట్ కి బీఆరెస్ బృందం.* టీ20 ముంబై లీగ్‌లోకి 9వ ఫ్రాంచైజీ: రూ. 106.88 కోట్లకు కొత్త జట్టును సొంతం చేసుకున్న ఏకే లక్కీ గ్రూప్ దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్ శ్రీశైలంలో భక్తులను అలరించిన భక్తి రంజని మల్లన్న సేవలో ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భేటీ: వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత చర్చలు సక్సెస్ మీదున్న నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ జర్నీపై నటి స్పందన! పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలి కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారంపై గ్రామాల వారీగా సమీక్ష ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హోమ్ కంపోస్టింగ్‌పై ప్రజలకు అవగాహన

దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్

Select Suryaa Now
దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలు

తాళాలు పగలగొట్టి దొంగతనాల కేసులో నలుగురి అరెస్ట్దుకాణాలు షట్టర్ల తాళాలు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముఠాను గోకవరం పోలీసులు పట్టుకొన్నారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలు, దొంగిలించిన బట్టలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరుకొండ సీఐ ఎస్.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు. గోకవరం మండలం వీరలంకపల్లి సెంటర్ లో ఈనెల 5న అర్ధరాత్రి ఒక షెడ్ తాళాలు పగలగొట్టి, అక్కడి సీసీ కెమెరాను ధ్వంసం చేసి బట్టలు, కళ్లజోళ్లు అపహరించిన ఘటనపై ఎస్పై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  దర్యాప్తులో భాగంగా గోకవరం ఠాణా సెంటర్ వద్ద అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు దొంగతనాల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ఇరువురు యువకులు, 2 మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సీఐ తెలిపారు. మరో నిందితుడు కుంజం అభి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. నిందితుల నుంచి నేరాలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే విచారణలో సెప్టెంబర్ 18న వీరలంకపల్లి జంక్షన్ సమీపంలోని టీ షాప్ తాళాలు పగలగొట్టి సుమారు రూ.5 వేల నగదు, సిగరెట్లు దొంగిలించిన కేసులో నిందితులు బయటపడినట్లు వెల్లడించారు. విచారణలో గత ఆగస్టు నుంచి కొంతమూరు- నల్లజర్ల హైవే పరిధిలో సుమారు 7 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.