భారతదేశాన్ని నిర్మించడంలో యువతదే ప్రధాన బాధ్యత: బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కందికట్లరాజేశ్వరి
భారతదేశాన్ని నిర్మించడంలో యువతదే ప్రధాన బాధ్యత: బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కందికట్లరాజేశ్వరి
గూడూరు, మేజర్ న్యూస్:
రాబోయే రోజుల్లో సంపూర్ణ వికసిత్ భారత్‌ను నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత పాత్ర అత్యంత కీలకమని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాజేశ్వరి కందికట్ల పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నెల్లూరు రూరల్ మండలం పల్లెపాడులోని గాంధీ ఆశ్రమంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్–2047’ అంశంపై విద్యార్థులతో ఆమె చర్చించారు.2047 నాటికి వికసించిన భారతదేశాన్ని చూడబోతున్న నేటి యువతరం దేశ నిర్మాణంలో ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? దేశ అభివృద్ధిలో తమ పాత్ర ఎలా ఉండాలి? అనే అంశాలపై విద్యార్థినీ, విద్యార్థులను ప్రశ్నిస్తూ వారిలో చైతన్యం కల్పించారు. విద్య, విజ్ఞానం, సాంకేతికత, పారిశ్రామిక రంగం, వ్యవసాయం, క్రీడలు తదితర అన్ని రంగాల్లో యువత తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.దేశంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విద్యార్థినులు ప్రస్తావించారు. దేశంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.భరతమాత ఒడిలో జన్మించిన ప్రతి ఒక్కరూ దేశానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని రాజేశ్వరి కందికట్ల అన్నారు. దేశం మనకు ఎంతో ఇచ్చిందని, భవిష్యత్ తరాలకు మరింత అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అందించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 20 పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. బీజేపీ నాయకురాలు గంటా విజయశ్రీ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
.