BREAKING
బంగారు దుకాణాలపై విజలెన్స్‌ దాడులు సోమిరెడ్డి బ్రతుక్కి జగన్ పై విమర్శలా - కాకాణి" స్థానిక పోరులో ‘కూటమి’ ప్రభంజనం ఖాయం.. బుచ్చిరెడ్డిపాళెం 28 వార్డుల్లో మనమే గెలవాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భారతదేశాన్ని నిర్మించడంలో యువతదే ప్రధాన బాధ్యత: బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కందికట్లరాజేశ్వరి స్టేట్ కోపరేటివ్ బ్యాంకు చే రాష్ట్రస్థాయిలో వేగవరం సొసైటీకి బెస్ట్ ఫెయిర్ ఫార్మాన్స్ స్టేట్ అవార్డు రూ 10.75 కోట్లతో మండపేటలో అభివృద్ధి పనులు ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ: పడిపోయిన రిలయన్స్ సంపదతో భారత కుబేరుల జాబితాలో పెను మార్పులు రేపు ఉదయం యాదాద్రి పవర్ ప్లాంట్ కి బీఆరెస్ బృందం.* టీ20 ముంబై లీగ్‌లోకి 9వ ఫ్రాంచైజీ: రూ. 106.88 కోట్లకు కొత్త జట్టును సొంతం చేసుకున్న ఏకే లక్కీ గ్రూప్ దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్ శ్రీశైలంలో భక్తులను అలరించిన భక్తి రంజని మల్లన్న సేవలో ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భేటీ: వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత చర్చలు సక్సెస్ మీదున్న నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ జర్నీపై నటి స్పందన! పరిగి హత్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా

స్టేట్ కోపరేటివ్ బ్యాంకు చే రాష్ట్రస్థాయిలో వేగవరం సొసైటీకి బెస్ట్ ఫెయిర్ ఫార్మాన్స్ స్టేట్ అవార్డు

Select Suryaa Now
స్టేట్ కోపరేటివ్ బ్యాంకు చే రాష్ట్రస్థాయిలో వేగవరం సొసైటీకి బెస్ట్ ఫెయిర్ ఫార్మాన్స్ స్టేట్ అవార్డు

జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్:- జంగారెడ్డిగూడెం మండలం వేగవరం ప్రాథమిక సహకార పరపతి సంఘం (పి. ఎ. సి. ఎస్) జిల్లా సహకార కేంద్రం బ్యాంకు లిమిటెడ్, ఏలూరు పరిధిలో 2025 - 2026వ సంవత్సరమునకు రాష్ట్రం మొత్తం మీద బెస్ట్ ఫెయిర్ ఫార్మన్స్ స్టేట్ లెవెల్ అవార్డు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ స్టేట్ లెవెల్ అవార్డ్ ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన విజయవాడలో 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ది.ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ఆప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు చేతుల మీదుగా ఈ సొసైటీ గౌరవం పొందింది.  అవార్డుతో పాటు నగదు బహుమతిగా రూ 20, 000లు అందజేశారు.  సొసైటీ సీఈవో సయ్యద్ అజ్మీర్ ఆలీ, సొసైటీ చైర్మన్ ఆలపాటి దుర్గా రామప్రసాద్ ( రాము)లకు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అవార్డును బహుకరించారు.  ఈ స్టేట్ అవార్డును పొందిన సీఈవో ఆలీ,  చైర్మన్ ఆలపాటి రాములను సొసైటీ సభ్యులు ,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులు అభినందించి సత్కరించారు.  ఈ సందర్భంగా సూర్య ప్రతినిధికి సీఈఓ ఆలీ సొసైటీ ప్రగతిని ప్రత్యేకంగా వివరించారు. 1951లో 13 మందితో ఏర్పడిన ఈ సొసైటీ ప్రస్తుతం 1000 మంది వరకు సభ్యులు ఉన్నారని, వారిలో 600 మందికి పైగా రైతులు ఉన్నారని తెలిపారు. 2025 మార్చి నాటికి 550 మంది రైతులకు రూ. 23, 07,74,000 ఇవ్వగా, 2026 మార్చినాటికి రూ.  26,10,25, 000లను 900 మంది రైతాంగానికి రుణాలు అందజేశామని వాటిలో  పైగా రికవరీ అయిందని వివరించారు.  సొసైటీ ఆవరణలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన 100 ఎం. టి గోడౌన్, శిధిలం కావడంతో రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, సొసైటీ చైర్మన్ ఆలపాటి  రాము ల వినతి మేరకు నూతనంగా 250 ఎం.టి  పరిమాణం గల గోడౌన్ ను రూ  30 లక్షలతో సొసైటీ ఆధ్వర్యంలో శరవేగంగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు.  గత ఏడాది వరకు గోడౌన్ శిథిలం కాక పూర్వం ఎరువుల వ్యాపారం ఈ గోడౌన్ ద్వారా జరిగిందన్నారు.  ఈ ఏడాది గోడౌన్ శిథిలం అవ్వడంతో ఎరువుల వ్యాపారమును నిలిపివేస్తామని తెలిపారు.  నూతనంగా నిర్మాణం జరుగుతున్న గోడౌన్ పూర్తి అయ్యి ప్రారంభోత్సవం అనంతరం తిరిగి ఎరువుల వ్యాపారం జరుగుతుందని వివరించారు. ఈ సొసైటీలో 900 మంది సభ్యులు ఉండగా , వారిలో 249 మంది మహిళలు ఉండడంతో ఈ సొసైటీ ప్రత్యేకత సంతరించుకొందన్నారు.  ప్రస్తుతం ఈ సొసైటీలో రూ 12 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని, గోల్డ్ లోన్స్ రూ 5.5 కోట్లు అందజేశామని తెలిపారు. సొసైటీలో 53 లాకర్లు ఉన్నాయన్నారు.  ఈ సొసైటీలో 2017- 18 నుంచి 2023 -24 వరకు ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు 23 కోట్ల 44 లక్షల 289 రూపాయలను డిపాజిట్లుగా అందజేస్తున్నామని వివరించారు. 2013లో సొసైటీకి ఎన్నికలు జరిగాయని ,అనంతరం సొసైటీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత చైర్మన్గా ఉన్న ఆలపాటి రాము ప్రథమంగా 57 ఆది ఆగస్టు 10వ తేదీన  చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారన్నారు.  ఆయనను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి మరో ఆరు నెలల పొడిగించారని తెలిపారు.  దీనితో పాటు పర్సన్స్ గా షేక్ ఖాసింబి,  నులకాని శివరామకృష్ణ ఉన్నారన్నారు.  సొసైటీకి త్రీ మాన్ పాలక వర్గంలో గత 13 సంవత్సరాలలో ఒక్క మహిళ పర్సన్ ఉండటం ఇదే ప్రథమం అని తెలిపారు.  ఈ సొసైటీ పరిధిలో వేగవరం, రామచర్లగూడెం ,పెద్దపల్లి రెవిన్యూ గ్రామాలు ఉన్నాయని, ఈ గ్రామాల రైతాంగానికి ,సభ్యులకు రుణాలతో పాటు అన్ని సౌకర్యాలు అందజేస్తున్నామని ఈవో అజ్మత్ అలీ సూర్య ప్రతినిధికి తెలియజేశారు.