దేశాయ్ తిప్పారెడ్డి ఆశీస్సులతో కురవంక అభివృద్ధికి ప్రత్యేక కృషి : వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జున స్పష్టం : మాజీ ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన స్థానిక ప్రజలు
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,కురవంక గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది.మదనపల్లె మండల జెడ్పీటీసీ అభ్యర్థి జె.కిరణ్మయి,కురవంక ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జునకు మద్దతుగా నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో మాజీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జెడ్పీటీసీ అభ్యర్థి జె.కిరణ్మయి,ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జునను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎంపీటీసీ అభ్యర్థి ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ దేశాయ్ తిప్పారెడ్డి ఆశీస్సులతో కురవంక గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని,ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇప్పటికీ గుర్తున్నాయన్నారు.ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో వైకాపాకు పట్టం కట్టేందుకు వారి సిద్ధంగా ఉన్నారన్నారు.ఇదిలా ఉండగా కురవంక పంచాయతీలో ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది.ఆవుల మల్లికార్జున ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డికి బాణసంచా పేల్చి,శాలువాలతో సన్మానించి అపూర్వ స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మదనపల్లి పరిశీలకులు అనూషా రెడ్డి,మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి రాఘవరెడ్డి,బీరంగి రేవతి,కోటూరి ఈశ్వర్,చరణ్,వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి