దీర్ఘకాలిక వ్యాధులకు మనస్థాపానికి గురై వృద్ధుడు ఆత్మహత్య
రావికమతం అక్టోబర్ 4 మేజర్ జ్యూస్ : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మనస్థాపానికి గురైన వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం గర్ణికం గ్రామంలో చోటుచేసుకుంది రావికమతం గ్రామానికి చెందిన బండారు అచ్యుతరావు 60 గర్ణికం గ్రామంలో తన సొంత ఇంటి ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు దీంతో శరీరం గుర్తుపట్ట లేనంతగా కాలిపోయి మరణించారు భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై రఘువర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.