డీలర్లు సీఈవోలు ఎఫ్ ఎఫ్ యస్ యాప్ పై అవగాహన కలిగి ఉండాలి.......... వ్యవసాయ సహాయ సంచాలకులు వి రామకోటేశ్వరి
పొన్నూరు మండలంలోని ఎరువుల డీలర్లు మరియు సహకార సొసైటీల సీఈఓలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎఫ్ఎఫ్ఎస్ సెంట్రల్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సహాయ సంచాలకులు వి. రామకోటేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి కొత్త ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అమలులోకి రానుందని ఎరువుల డీలర్ లు సహకార సొసైటీ సిఈఓ లు ఈ యాప్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) సిబ్బంది రైతులకు ఈ యాప్ లో వారే సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు బయో స్టిమ్యులెంట్స్ ను 'O' ఫారాలు లేకుండా విక్రయించవద్దని డీలర్లకు స్పష్టం చేశారు. మండల వ్యవసాయ అధికారి ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త ఎఫ్ఎఫ్ఎస్ యాప్ లో ఫార్మర్ ఐడీ (రైతు గుర్తింపు సంఖ్య) తప్పనిసరి అని తెలిపారు. కాబట్టి ఈ నెల 20వ తేదీ లోపు మండలంలో సొంత పొలం ఉన్న రైతులందరూ 100 శాతం ఫార్మర్ ఐడీ పొందేలా చూడాలన్నారు.ఫార్మర్ ఐడీ లేకపోతే రైతులకు ఎరువులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, కావున రైతులందరూ తమ గ్రామంలోని ఆర్ఎస్కే సిబ్బందిని కలిసి వెంటనే ఫార్మర్ ఐడీలు పొందాలని కోరారు.