BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

దారి తీసి.. చెరువు మింగి: గురువర్యుడి కబ్జా దర్బార్!

Select Suryaa Now
దారి తీసి.. చెరువు మింగి: గురువర్యుడి కబ్జా దర్బార్!

 

జేసీబీలతో ప్రభుత్వ రోడ్డు ధ్వంసం.. చెరువు గర్భం ఆక్రమణకు యత్నం

అచ్యుతాపురంలో ఉపాధ్యాయుడి బరితెగింపుపై గ్రామస్థుల ఆగ్రహం

పాతపట్నం అక్టోబర్ 13,మేజర్ న్యూస్:


విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఆక్రమణల బాట పట్టి బరితెగించిన ఘటన పాతపట్నం మండలం అచ్యుతాపురంలో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలోని ముత్యాలమ్మ వీధిలో రాకపోకలకు ఆధారంగా ఉన్న ప్రభుత్వ రహదారిని సదరు ఉపాధ్యాయుడు జేసీబీ యంత్రాలతో దర్జాగా తవ్వించి ధ్వంసం చేయడమే కాకుండా, పక్కనే ఉన్న చెరువు గర్భాన్ని ఆక్రమించేందుకు తెగబడ్డాడు. సర్వే నంబర్ 10/5 పరిధిలోని స్థలానికి సంబంధించి ఇప్పటికే రికార్డుల్లో ఏడు అడుగుల స్థలం తేడా ఉండటంతో వివాదం నడుస్తోంది. ఆ వివాదం కొలిక్కి రాకముందే, రెవెన్యూ నిబంధనలు తుంగలో తొక్కి రోడ్డును కత్తిరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రాజకీయ అండదండల ధీమాతోనే ఈ దౌర్జన్యానికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ధ్వంసమైన రహదారిని పునరుద్ధరించాలని, ఆక్రమణలకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.