BREAKING
తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సిఐటియు యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

డాక్టర్ హేమాక్షి ని ఘనంగా సన్మానించిన బూర్జ గ్రామస్తులు

Select Suryaa Now
డాక్టర్ హేమాక్షి ని ఘనంగా సన్మానించిన బూర్జ గ్రామస్తులు

సీతానగరం, సూర్య : విస్తృత ఆయుష్ సేవలకు గుర్తింపుగా పలు అవార్డులతో పాటుగా బూర్జ ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సాధించిన ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి ని గ్రామస్థులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చి దిద్ది, ఆవరణలో పలు ఔషధ మొక్కలు నాటి వాటి నిర్వహణ బాధ్యత చేపడుతూ, ఉపయోగాలపై అవగాహన కల్పిస్తూ ఇటు ఆసుపత్రిలో రోగులకు సేవలతో పాటు , క్షేత్ర స్థాయిలో వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలతో ఆయుష్ సేవలను విస్తృతం చేయడంలో డాక్టర్ హేమాక్షి కీలక పాత్ర పోషించారని గ్రామస్తులు కొనియాడారు. ఏభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బూర్జ ఆయుర్వేద వైద్యశాలకు డాక్టర్ హేమాక్షి విశిష్ట సేవలతో మంచి గుర్తింపు తెచ్చారని, ఇక్కడే పుట్టి విద్యాభ్యాసం చేసి జిల్లా స్థాయిలో పేరు,ప్రఖ్యాతులు గడించారని, గ్రామానికే ఎంతో గర్వకారణమని టిడిపి నాయకులు పరువాడ. అచ్యుత నాయుడు ప్రశంసించారు. తమ శిష్యురాలు వైద్య వృత్తిలో ఎన్నో ప్రశంసలు అందుకోవడం, ఆసుపత్రికి గుర్తింపు తీసుకురావడం ఆనందదాయకమని స్థానిక రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అల్లక. శంకరరావు మాస్టారు కొనియాడారు. వీరితో పాటు మాజీ సర్పంచ్ గుజ్జల. దాసు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది ఆమె సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరింత గుర్తింపు పొందాలని ఆశీస్సులు అందజేశారు. ఉన్నతాధికారులు ఆదేశాలు, సూచనలు అమలు చేస్తూ  ప్రజారోగ్యమే ద్యేయంగా ఆయుష్ సేవలను మరింతగా విస్తృతం చేస్తామని డాక్టర్ హేమాక్షి ఈ సందర్భంగా అన్నారు. గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.

 

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.