బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం
గరుగుబిల్లి, సూర్య : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్లు ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంపై అధికారి యం త్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ఈనేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ బాక్సులను శుక్రవారం ఎంపీ డీవో కార్యాలయ సిబ్బంది గుంట్రెడ్డి కృష్ణప్రసాద్, అలజంగి శ్రీకాంత్, గంట విజయలక్ష్మి,డాకోజు సూర్యప్రభాకర్ తదితరులు శుభ్రం చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు అవసరమైన పోలింగ్ బాక్స్ లను ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.అదే విధంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన ముసాయిదా జాబితా ను ఇప్పటికే ప్రచురణ చేయడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ వెల్లడించారు.మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీ లించి త్రాగు నీటి సౌకర్యం, విద్యుత్తు, అవసరమైన చోట ఓటర్లు వెళ్లేందుకు వీలుగా ర్యాంపులు, తదితర సౌకర్యా లను పూర్తిస్థాయిలో కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొ న్నారు.అదే విధంగా త్వరలో జరగను న్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమును పరిశీలించడం జరిగిందన్నారు.ఈమేరకు గరుగుబిల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠ శాల మరియు కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు సంబంధించి పరిశీలించడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుపై ఉన్నతాధి కారులకు నివేదిక పంపించడం జరిగిందని ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ పేర్కొన్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.