బిజెపి ఎంపీటీసీ అభ్యర్థిగా నాగ వరలక్ష్మి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం ఎంపీటీసీ–1 స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దోసపాటి పెద్ద సుబ్బారావు సతీమణి నాగ వరలక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ–1 కంబాల శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థిగా నాగ వరలక్ష్మి నామినేషన్ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. గోకవరం–తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం నుంచి కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలివచ్చారు. పార్టీ అభ్యర్థి నాగ వరలక్ష్మితో కలిసి అక్కడి నుంచి దేవిచౌక్‌లోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు నాగ వరలక్ష్మి, పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి సన్నిధిలో ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం దేవిచౌక్ నుంచి అభ్యర్థి నాగ వరలక్ష్మితో కలిసి కంబాల శ్రీనివాసరావు పార్టీ శ్రేణులతో ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అనంతరం గోకవరం ఎంపీటీసీ–1 స్థానానికి నాగ వరలక్ష్మి తన నామినేషన్ పత్రాలను, కంబాల శ్రీనివాసరావుతో కలిసి అధికారులకు సమర్పించారు. అభ్యర్థి నాగ వరలక్ష్మికి మద్దతుగా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది.