భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్..
దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.
పాలగిరి గౌరి శంకర్ సూర్య తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్