BREAKING
ముక్కామల కూటమి ఎంపీటీసీ నామినేషన్లకు భారీ ర్యాలీ పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి

భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన

Select Suryaa Now
భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన

తిరుపతి ;రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలై ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా రామచంద్రాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు.నామినేషన్ల దాఖలు ప్రక్రియపై స్థానిక నేతలతో చర్చించి, అభ్యర్థులకు వారి ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.నామినేషన్ పత్రాలలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా, అవసరమైన ధృవీకరణ పత్రాలన్నింటినీ స్థానిక నాయకుల సహకారంతో ముందుగానే సరిచూసుకుని సకాలంలో దాఖలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.