BREAKING
నాలుగుసార్లు ఓడినా.. ప్రజలతోనే! ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టులు పాత్ర కీలకం తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు.. క్వినోవాతో శరీరంలోని వాపులు మాయం! వివాహ దోషాలను హరించే దివ్యక్షేత్రం, శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం మెగాస్టార్ 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. డబ్బింగ్ పనులు షురూ! చందుర్తి గ్రామపంచాయతీ లో వైద్య పరీక్షలు ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా టీడీపీ బలోపేతానికి చేయి చేయి కలుపుదాం ఘనంగా ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరిన భాగ్యనగరుని లంబోదరుడు! భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న చెక్‌డ్యామ్‌! అనకాపల్లిలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం అంబేడ్కర్ కి వినతిపత్రం తో నిరసన తెలియజేసిన వీఆర్ఏలు ఏపీలో పెట్టుబడులకు టోరెంట్ గ్రూప్‌నకు ఆహ్వానం.. అహ్మదాబాద్‌లో సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి.

బీటీపీ కాలువ మట్టి అక్రమ తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి

Select Suryaa Now
బీటీపీ కాలువ మట్టి అక్రమ తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి

బీటీపీ కాలువ మట్టి అక్రమ తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి

అనంతపురం బ్యూరో 

 

 

 కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) కాలువ పనుల్లో తవ్విన మట్టిని అనుమతులు లేకుండా అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనతో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమి నుంచి తవ్విన మట్టిని నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో తరలిస్తున్నారని రంగయ్య ఆరోపించారు. అక్రమ మట్టి రవాణా వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈ హామీ ఇచ్చారు.