బీసీలు అంటూ నకిలీ బీసీ సర్టిఫికెట్లతో పోటీకి సిద్ధమవుతున్నారు.
రెండు ప్రధాన పార్టీలు ఇలాంటి నకిలీలను ప్రోత్సహించకూడదు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అగ్రకులాలకు చెందిన వారు బీసీలు అంటూ హల్చల్ . బుధవరపు బాలాజీ జిల్లా అధ్యక్షులు బీసీవై పార్టీ యనమల నాగేశ్వరరావు ప్రముఖ అనలిస్ట్
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోనీ మూడవ మైల్ యాదవ రాజు గార్డెన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాట్లాడుతూ కొంతమంది అగ్రకులాలకు చెందినవారు బీసీలు మంటూ ప్రచారం చేసుకుంటూ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నారు ఈ విషయాన్ని నెల్లూరు నగర ప్రజలు గమనిస్తున్నారు . ఆయా పార్టీలకు చెందిన నేతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి వారిని ప్రోత్సహించకుండా నిజమైన బీసీలకే టికెట్ల కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లొంగి బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తే తగినముల్యం చెల్లించుకోవలసి వస్తుందని బాలాజీ డిమాండ్ చేశారు . ఈ నేపథ్యంలో ఎలాగైనా కార్పొరేషన్లు ఎంత ధనమైన ఖర్చుపెట్టి గెలుపొందాలని ఆలోచనలతో నకిలీ బీసీ సర్టిఫికెట్లు పొంది పోటీకి సిద్ధమవుతున్నట్టు నగరంలో ఇలాంటి సమాచారం హల్చల్ చేస్తుంది. బీసీవై పార్టీ ఇలాంటి నకిలీ బీసీలను ప్రోత్సహించకుండా నిజమైన అర్హులైన ఉన్నత విద్యావంతులు మాత్రమే బిసి రిజర్వేషన్ ఉన్నచోట బీసీలకు మాత్రమే బి ఫామ్ ఇచ్చి ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా బాలాజీ తెలియజేశారు.