andhrapradesh
బద్వేల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్..
బద్వేల్/అట్లూరు: కడప జిల్లా బద్వేల్‌లో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాను పోలీసులు అరెస్టు చేసి, అట్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే అరెస్ట్ సమాచారం తెలుրగానే జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్దఎత్తున అట్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. మరోవైపు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా మోహరించారు. ఈ క్రమంలో అక్కడ టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బద్వేల్‌లో ఒక్కసారిగా వేడి పుట్టింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తీవ్రంగా శ్రమిస్తున్నారు.