బాలికల పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు
అనంతపురం బ్యూరో : బాలికల పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు
కొత్త టాయిలెట్లు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు మంత్రి సత్యకుమార్ చొరవ
ధర్మవరం, సెప్టెంబర్ 29: ధర్మవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి మంత్రి, ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ చర్యలు చేపట్టారు. విద్యార్థినులు స్వయంగా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన కొత్త యూరిన్ టాయిలెట్లు, లెట్రిన్ పిట్స్ నిర్మాణంతో పాటు పాఠశాల ఎదుట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్‌బాబు మంగళవారం పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్ సుమనతో కలిసి పాత టాయిలెట్లను పరిశీలించారు. కొత్త వసతుల నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేసి పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
విద్యార్థినుల భద్రత కోసం పాఠశాల ఎదుట రెండు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అంశాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించడంపై విద్యార్థినులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.