అనంతపురంలో రెండవ రోజు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ
అనంతపురం బ్యూరో
అనంతపురంలో రెండవ రోజు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ..*
అనంతపురం, సెప్టెంబర్ 29 :
అనంతపురంలోని రాంనగర్‌లోని ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మంత్రివర్యులు తెలిపారు.