BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

అనకాపల్లిలో రెచ్చిపోతున్న భూ రాబందులు.

Select Suryaa Now
అనకాపల్లిలో రెచ్చిపోతున్న భూ రాబందులు.

రిటైర్డ్ తహసీల్దార్ భూమికే ఎసరు - అక్రమంగా రికార్డుల టాంపరింగ్.

మా పిత్రార్జిత భూమిలోకి వస్తే చర్యలు తప్పవు.
 

- బాధితుడు కొణతాల సత్యనారాయణ


జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ఏకంగా రెవెన్యూ శాఖలో తహసీల్దార్ గా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి భూమిని సైతం కబ్జాదారులు వదలడం లేదు. అనకాపల్లి పట్టణానికి చెందిన కొణతాల సత్యనారాయణ సోమవారం సాయంత్రం సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "నా తండ్రి కొణతాల శ్రీరాములు ఇదే జిల్లాలో తహసీల్దార్ గా పనిచేసి 1991లో రిటైర్డ్ అయ్యారు. ఆయన నుంచి వారసత్వంగా అనకాపల్లి పట్టణం సౌత్-టూ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1295/7 లో గల 0.79 సెంట్ల భూమి వీలునామా ద్వారా నాకు దఖలు పడింది. నేను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయ్యాక పిల్లల చదువులు, పెళ్లిళ్ల కారణంగా పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకోలేదు. 2021లో వెబ్ ల్యాండ్ అడంగల్ లో చెక్ చేస్తే మా నాన్న పేరు మీదనే రికార్డు ఉంది. కానీ 2023లో మాకు తెలియకుండానే రికార్డు మార్పు జరిగింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వద్ద పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయగా, సదరు భూమి పూర్తి విస్తీర్ణం కర్రి నూకల తల్లి పేరున వెబ్ ల్యాండ్ లో నమోదు అయినట్లు ఎండార్స్ మెంట్ ఇచ్చారు. ఎస్.ఎఫ్.ఏ రికార్డుల నుంచి మా తాత కొణతాల అప్పలనాయుడు పేరున, 2021 వరకు కొణతాల శ్రీరాములు పేరున ఉన్న రికార్డు ఎలా మారిందో చెప్పాలని కోరుతున్నాను" అని అన్నారు. ప్రస్తుతం తమ భూమిలోకి అనకాపల్లి గవరపాలెం ప్రాంతానికి చెందిన కొణతాల రాము, రామారావు అనే వ్యక్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని, వారిపై టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ, జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని తెలిపారు. మాకు పిత్రార్జితంగా వచ్చిన భూముల్లోకి ఎవరైనా అక్రమంగా చొరబడితే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు.

రవికుమార్ 

ఎన్ డి పి సూర్య ప్రతినిధి