BREAKING
విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఐకానిక్ ‘ఎంఎస్ బ్లూ’ చీరలో రష్మిక మందన్నా.. అద్భుతమైన లుక్‌తో ఘన నివాళి!

అంగన్వాడి, ఆశా వర్కర్ల నిరసన

Select Suryaa Now
అంగన్వాడి, ఆశా వర్కర్ల నిరసన

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆశా, అంగన్వాడీ వర్కర్ల నిరసన
అవనిగడ్డ, అక్టోబర్ 6 మేజర్ న్యూస్: ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వారు తమ డిమాండ్లపై నినాదాలు చేశారు.
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనాలు పెంచడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నిరసనకారులు వినతిపత్రం అందజేయకుండానే వెనుదిరిగారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.-అజంతా శ్రీనివాస్