BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపిక

Select Suryaa Now
ఆంధ్రప్రదేశ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపిక

ఆంధ్రప్రదేశ్ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపిక 

 21వ జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీకి రాష్ట్ర జట్లు

విజయవాడ, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అక్టోబర్‌ 5 నుంచి 10 వరకు జరుగనున్న 21వ జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ కు ఆంధ్రప్రదేశ్ జట్లు పయనమైనట్లు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్ తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ బాలుర, బాలికల జట్లు ప్రాతినిత్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు క్రీడా దుస్తులను టీడీపీ నాయకులు కోనేరు రాజేష్ చేతుల మీదగా అందజేయడం జరిగింది. రాష్ట్ర చైర్మన్ డా.దారం నవీన్ కుమార్, అధ్యక్షులు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. బాలుర విభాగంలో పీ.వి.చిన్హాస్, ఎమ్.రేవంత్, వి.జయరామ్ సంజయ్ (ఎన్టీఆర్ జిల్లా), ఎస్.ఈశ్వర హితేష్, ఎన్.అర్జున్ సాయి, ఎస్.కె.తంజీల్, ఎస్‌.కె.గౌస్‌ మొహిద్దీన్‌ (కృష్ణాజిల్లా), సిహెచ్.ఎల్‌.వెంకట సందీప్‌ (కాకినాడ), బాలికల విభాగంలో ఏ.శ్రీ వైశాలి, (ఎన్టీఆర్ జిల్లా), ఏ.దివ్య జ్యోతి, కె.భాగ్యశ్రీ, బి.తేజశ్రీ (కాకినాడ), ఆర్.హాసిని (గుంటూరు), డి.అరిఫా (అనంతపురం), ఎమ్.మోక్ష (కడప), జె.ఇషితా (విశాఖపట్నం)లు ఎంపికయ్యారు.