BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ ప్రచార ఆర్భాటమే: అనంతపురంలో చంద్రబాబుపై సాకే శైలజానాథ్ ధ్వజం, సీమ రైతులను ఆదుకోవాలని డిమాండ్ రాకా సినిమా కాస్టింగ్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. తెరపైకి కొత్త చర్చ! పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహానటి శారద లేటెస్ట్ ఫోటోలు.. అస్సలు గుర్తుపట్టలేకపోతున్న అభిమానులు! గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: తాడేపల్లి నివాసంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు!

అక్టోబర్ 6న రాజమహేంద్రవరంలో జాబ్ మేళా

Select Suryaa Now
అక్టోబర్ 6న రాజమహేంద్రవరంలో జాబ్ మేళా

 

నేటి దినపత్రిక సూర్య  బ్యూరో రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 6వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం తాడితోటలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ పక్కన ఉన్న ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష శుక్రవారం  తెలిపారు.

ప్రముఖ శ్రీ వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలోని ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, అగ్రి బిజినెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు చెందిన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఫుల్‌స్టాక్‌ డెవలపర్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, క్లౌడ్‌ ఇంజనీర్, సెర్చ్‌ ఇంజిన్‌ స్పెషలిస్ట్, ఎడిటర్, అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్, టెలీకాలర్, బీపీఓ తదితర పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇంజనీరింగ్‌ లేదా ఏదైనా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి, అనుభవం ఉన్న లేదా ఆయా ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన 22 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in ద్వారా తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని, రెజ్యూమే, ఆధార్‌ కార్డు, సంబంధిత విద్యా సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో జాబ్‌ మేళాకు హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం 9398318601 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష కోరారు.