BREAKING
Title: నేటి పంచాంగం – 14 అక్టోబర్ 2026: తిథి, నక్షత్రం, వర్జ్యం మరియు శుభ ముహూర్తాల వివరాలు! నేటి రాశి ఫలాలు – 14 అక్టోబర్ 2026: ద్వాదశ రాశుల ఫలితాలు మరియు రోజువారీ సూచనలు! అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సంచలన బెంగాలీ సినిమా 'తషెర్ ఘర్': గృహిణుల జీవితాన్ని కళ్లకు కట్టే మాస్టర్‌పీస్ నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

అక్షరాలు దిద్దాల్సిన చేతులతో ఆక్రమణలు

Select Suryaa Now
అక్షరాలు దిద్దాల్సిన చేతులతో ఆక్రమణలు

 

అచ్యుతాపురంలో పంతులయ్య వీరంగం

పాతపట్నం 

సమాజానికి మార్గదర్శకంగా నిలిచి, భావి భారత పౌరులకు అక్షరాలు దిద్ది, సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఆక్రమణల బాట పట్టడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ నిర్మాణాలు, దౌర్జన్యాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్న ఘటన పాతపట్నం మండలం అచ్యుతాపురంలో వెలుగుచూసింది. ఇష్టారాజ్యంగా నిబంధనలను కాలరాస్తూ, ప్రభుత్వ వ్యవస్థలను లెక్కచేయకుండా సాగిస్తున్న ఈ వ్యవహారం వెనుక అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అచ్యుతాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 10/5లో భూమికి సంబంధించి తీవ్రమైన వివాదం నడుస్తోంది. అయినప్పటికీ సదరు ఉపాధ్యాయుడు ఎటువంటి ‘సూడా’ నిబంధనలు, అధికారిక అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అంతటితో ఆగకుండా, స్థానికులు రాకపోకలు సాగించే రహదారిని జేసీబీ సాయంతో పూర్తిగా తవ్వేసి, రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించారు.
ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా పాఠశాల సమయాల్లో విధులను గాలికొదిలేసి దర్జాగా రియల్ ఎస్టేట్ దందాలు, అధిక వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నా విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. నేను ఉపాధ్యాయుడినైనా రియల్ ఎస్టేట్ చేస్తా.. ఇల్లు కడతా.. దారి కట్ చేస్తా.. కాలువ వేసిన నన్నెవరు అడుగుతారు?" అన్న ధోరణిలో సదరు పంతులయ్య ప్రవర్తిస్తుండటంపై స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ పలు దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో సదరు ఉపాధ్యాయుడి అహం దెబ్బతింది. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, నేరుగా విలేకరి ఇంటికి వెళ్లి దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, నా వ్యవహారాలకే అడ్డువస్తావా? నా మొదటి శత్రువు నువ్వే.. నీ అంతు చూస్తా అంటూ బహిరంగంగా వీరంగం సృష్టించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే కలం గళాన్ని నొక్కే ప్రయత్నం చేయడం, పాత్రికేయునికే రక్షణ లేని పరిస్థితి కల్పించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇంత బహిరంగంగా దౌర్జన్యాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగంలో కనీస చలనం లేకపోవడం స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అక్రమ నిర్మాణంపై పంచాయతీ అధికారులు ఇప్పటివరకు కనీసం ఒక్క నోటీసు కూడా జారీ చేయకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివాదాస్పద సర్వే నెంబర్ 10/5 లోని భూమిని పూర్తిస్థాయిలో సరిహద్దులు నిర్ణయించి, పక్కాగా సమగ్ర సర్వే నిర్వహించాలని సదరు లేఅవుట్ కొనుగోలుదారులు, బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయడంతో పాటు, రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. అలాగే పాత్రికేయుడిపై దాడికి యత్నించి బెదిరింపులకు పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిపై, ఆయనకు వత్తాసు పలుకుతున్న అనుచరులు అధికారులపై
ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.