BREAKING
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కళాకారుల ఐక్యతే మన బలం విద్యుత్ షాక్‌తో యమహా షోరూం మెకానిక్ మృతి! వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఏఐటీఏ ఎన్నికల బరిలోకి సానియా మీర్జా, మహేశ్ భూపతి.. పోటీకి దూరంగా నిలిచిన లియాండర్ పేస్ నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు *కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి* *మర్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే*

ఆత్మకూరులో వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై --టీడీపీలో చేరిన డాక్టర్ ప్రణీత్

Select Suryaa Now
ఆత్మకూరులో వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై  --టీడీపీలో చేరిన డాక్టర్ ప్రణీత్

ఆత్మకూరు,మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కీలక నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరారు.  ప్రముఖ సంఘసేవకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు, ప్రజా వైద్యశాల అధినేత డాక్టర్ ప్రణీత్ ,ఆయన సతీమణి డాక్టర్ హారిక,ఆయన మామ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం తమ అనుచరులు, అభిమానులతో కలిసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి డాక్టర్ ప్రణీత్‌తో పాటు ఆయన అనుచరులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆత్మకూరు పట్టణంలో వైద్యరంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందిన డాక్టర్ ప్రణీత్ కుటుంబం, తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరిన తరుణంలో మరో కీలక నేత డాక్టర్ ప్రణీత్ కుటుంబం చేరికకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కాటంరెడ్డి రవీంద్రా రెడ్డి, చల్లా రవికుమార్ రెడ్డి, గొట్టిగుండాల బుజ్జిరెడ్డి, డాక్టర్ కే. వి. శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.