‘ఆర్నాబ్’ తుఫాను నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం
సీతమ్మధార, సూర్య : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో, అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆర్నాబ్ తుఫాను ప్రభావం ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించారు. తుఫాను పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ ద్వారా 12 జిల్లాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎండీ, విద్యుత్ వ్యవస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు సిబ్బంది, వాహనాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసామని సీఎండీ తెలిపారు. అలాగే, తుఫాను ప్రభావంతో తెగిపడిన విద్యుత్ వైర్లు, వాలిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిన చెట్ల కొమ్మల సమీపానికి వెళ్లరాదని వినియోగదారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేసి సహకరించాలని కోరారు.
జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు
శ్రీకాకుళం
శ్రీకాకుళం - 9701400865
టెక్కలి - 9490610050
పలాస - 08945241084
పార్వతీపురం మన్యం
పాలకొండ – 8332843546
పార్వతీపురం – 9398594750
విజయనగరం
విజయనగరం టౌన్ – 9490610102
విజయనగరం రూరల్ – 9490610102
బొబ్బిలి – 9490610121
విశాఖపట్నం
జోన్–I – 9490610019
జోన్–II – 9849628880
జోన్–III – 9491030722
అనకాపల్లి
అనకాపల్లి – 9063110544
కశింకోట – 8333810597
నర్సీపట్నం – 9491030723
అల్లూరి సీతారామరాజు (ASR)
పాడేరు – 9490610027
కాకినాడ
జగ్గంపేట – 9490610097
కాకినాడ – 9490610856
పెద్దాపురం – 9493178728
తూర్పు గోదావరి
రాజమహేంద్రవరం టౌన్ – 9490610855
రాజమహేంద్రవరం రూరల్ – 9493178874
నిడదవోలు – 9493177540
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
అమలాపురం – 9490610101
కొత్తపేట – 9493178821
పశ్చిమ గోదావరి
నరసాపురం – 7382050943
భీమవరం – 9490610143
తాడేపల్లిగూడెం – 9493177806
ఏలూరు
ఏలూరు – 9440904037
జంగారెడ్డిగూడెం – 9491030712
పోలవరం
రంపచోడవరం – 8309771508
ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం - 8331018762
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.