ఆక్రమణదారులకు నోటీసులు జారీ
జంగారెడ్డిగూడెం సూర్య న్యూస్ మండలంలో వేగవరం ఎన్ హెచ్ ఎన్ హెచ్ 560 (డి) జాతీయ రహదారిలోని గల ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న దుకాణం దారులు స్వచ్ఛందంగా ఖాళీ చేయకపోతే నిబంధనల ప్రకారం తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం