8 న ఉల్లగల్లు, కల్లూరు సబ్ స్టేషన్ లు ప్రారంభం.
సూర్య న్యూస్ దర్శి.
ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు కురిచేడు మండలంలోని కల్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ లు ను గురువారం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , సిఎండి పీ పుల్లారెడ్డి ప్రారంభించనున్నారని ఏ డి ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది. అనుకున్న సమయం కంటే తక్కువ కాలంలోనే సబ్ స్టేషన్ ల నిర్మాణం పూర్తయిందని ఆయన తెలిపారు దీంతో నాణ్యమైన విద్యుత్తు వినియోగదారులకుఅందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. రెండు సబ్ స్టేషన్ల పరిధిలో లో వోల్టేజ్ సమస్య తీరనందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.