34వ డివిజన్‌లో సరి పూటీ రమణకు మద్దతుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి ప్రచారం..
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 34వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ డివిజన్ అభ్యర్థి సరిపూటీ రమణకు మద్దతుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రాంతాల్లో పర్యటిస్తూ అభ్యర్థికి ఓటు వేయాలని, తమ ఆశీస్సులు అందించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా బల్లా పల్లవి మాట్లాడుతూ, 34వ డివిజన్ అభ్యర్థి సరిపూటీ రమణకు ప్రజలందరూ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు. ఈ కార్యక్రమంతో 34వ డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది.