25వ డివిజన్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : నగరంలోని 25వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేడు ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు, 25వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి దాట్ల చక్రవర్తన్ రెడ్డికి అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.