17వ డివిజన్‌లో టీసీ వరుణ్ విస్తృత ప్రచారం.. కూటమి అభ్యర్థి భవాని రవికుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి.. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కూటమి నాయకులు.. ప్రజల నుంచి విశేష స్పందన
అనంతపురం ప్రతినిధి, మేజర్ న్యూస్:- అనంతపురం నగరంలోని 17వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి భవాని రవికుమార్‌కు మద్దతుగా జనసేన జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థి భవాని రవికుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ.. మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు, కార్పొరేటర్ అభ్యర్థి భవాని రవికుమార్ గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమంలో కాయగూరల లక్ష్మీపతి, అంగడి చలపతి, శ్రీ వర్ధన్, సురేష్, కాయగూరల లక్ష్మీప్రసాద్, వెంకట్ నారాయణ, దరాజ్ భాష, మాధవ్, విజయ్ పాల్గొన్నారు. వీర మహిళలు అనసూయ, తిరుమల, గిరిజమ్మతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మేదర వెంకటేష్, మల్లికార్జున, శివకుమార్, ఈశ్వర్, బాబురామాంజి, రఘు, పురుషోత్తం, మధు, నాగార్జున, సాయి, నవీన్, మంచాల చంద్ర, బీజేపీ నాయకుడు చంద్ర తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..