బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 02:44 PM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో 500 మంది బీసీ సభ్యులతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 18న జరగబోయే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరపాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అయినా రిజర్వేషన్లు సాధించుకుంటామని హెచ్చరించారు.