|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 05:03 PM
మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. మంగళవారం ఒక్కరోజే ధరలు అమాంతం పెరిగి పెట్టుబడిదారులకు ఆనందాన్ని, కొనుగోలుదారులకు తీవ్ర షాక్‌ను ఇచ్చాయి. ముఖ్యంగా వెండి ధర చరిత్రలో తొలిసారిగా కిలోకు రూ.2 లక్షల మైలురాయిని దాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. బంగారం ధరలు కూడా అదే బాటలో పయనించి భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కరోజే రూ.9,000 పెరిగి రూ.2,06,000కి చేరింది. గత పది రోజుల్లోనే వెండిపై ఏకంగా రూ.35,000కు పైగా పెరగడం గమనార్హం. మరోవైపు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.3,000 పెరిగి రూ.1,17,950 వద్ద నిలిచింది. ఇక, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.3,280 పెరిగి రూ.1,28,680కి ఎగబాకింది.