BREAKING
సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు! గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం

యాసంగిలో వరి సాగు తగ్గించండి

Select Suryaa Now
యాసంగిలో వరి సాగు తగ్గించండి

సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ :రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, తాగు, సాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతులు, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాబోయే పది నెలలపాటు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఉన్న నీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కొందామన్నా నీళ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేసిన ఆయన, రైతులు ఎవరో చెప్పే మాటలు నమ్మవద్దని, ఈ యాసంగిలో వరి పంట వేయకండి అని కోరారు. సాధ్యమైనంతవరకు యాసంగి పంటను తగ్గించి, ఒక సీజన్ పంటను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంట వేయని కారణంగా ఉపాధి కోల్పోయే రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామని, పంట సాగు చేయని రైతులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను సబ్సిడీ ధరకు అందించాలని కేంద్రాన్ని కోరారు. కొన్ని వర్గాలు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పైశాచిక ఆనందం పొందుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.