BREAKING
ఢిల్లీ దసరా వేడుకల్లో వినూత్న నిరసన: 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేత కపిల్ మిశ్రా! దేశ ఆర్థిక ప్రగతే లక్ష్యం...తజికిస్థాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటన వైఎస్సార్‌సీపీ ZPTC అభ్యర్థి భర్త లక్ష్మారెడ్డిపై దాడి వారణాసిలో ఏనుగు బీభత్సం: గొలుసు తెంచుకుని విధ్వంసం.. మావటికి తీవ్ర గాయాలు.. మత్తు ఇచ్చి బంధించిన నిపుణులు! మంత్రి శ్రీధర్ బాబుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన.. మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ సీఎం నివాళులు పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, జెలెన్‌స్కీతో విట్కాఫ్ భేటీపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటన పోలీసు అమరవీరులకు ఘన నివాళి: యూనిఫామ్ బాధితులకు భరోసా కావాలి.. ఏపీ ప్రభుత్వం పిలుపు! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది. ---- బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి వెల్లడించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను తొలగించిన ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం ఫోర్టెస్క్యూ సీఎస్‌ఎల్ నూతన సీఈఓగా డెబోరా వాటర్‌హౌస్ నియామకం పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు.. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మూడో త్రైమాసికంలో అంచనాలను తలకిందులు చేసిన నార్వే డీఎన్‌బీ కాప్31 సదస్సు వేదికగా క్లీన్‌టెక్ టారిఫ్‌లపై పోరుకు చైనా సన్నాహాలు

విజయాలు సాధిస్తూ ముందుకు సాగుదాం...

Select Suryaa Now
విజయాలు సాధిస్తూ ముందుకు సాగుదాం...

సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్.…ఈ విజయదశమి దసరా పండుగతో ప్రజలందరూ విజయాలు సాధించి సంతోషాలతో  గడపాలని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. 
సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సత్తుపల్లి ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే పెనుబల్లి మండలం లో కల్లూరు మున్సిపాలిటీ లో బతకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పెనుబల్లి మండలం, టేకులపల్లి గ్రామం లో నిర్వహించిన బతకమ్మ వేడుకల్లో కల్లూరు మున్సిపాలిటీలో లక్కినేని వారి రోడ్, రాధాకృష్ణ హాస్పిటల్ రోడ్,మధిర రోడ్, పుల్లయ్య బంజర్ రోడ్ లలో ఏర్పాటు చేసిన బతకమ్మ ల వద్ద మహిళలు, మున్సిపల్ చైర్మన్, మహిళా కౌన్సిలర్స్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్స్,, సర్పంచ్ లతో కలిసి ఘనంగా నిర్వహించిన బతకమ్మ వేడుకల్లో కోలాటం, సాంప్రదాయాల నృత్యాలతో  మహిళలతో కలిసి ఎమ్మెల్యే  రాగమయి పాల్గొన్నారు.
అనంతరం కల్లూరు మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతకమ్మ వేడుక సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గం ప్రజలందరి జీవితాల్లో ఈ విజయదశమి విజయాలను అందించాలని ఆకాంక్షించారు.

సత్తుపల్లి సూర్య (కిరణ్ కుమార్ ఆరిక)